విశ్వంభర హడావిడి ఏది వశిష్ట

No Update From ViswambaraNo Update From Viswambara

 

ఆగష్టు 22 మెగాస్టార్ చిరు బర్త్ డే. ఆయన బర్త్ డే వస్తుంది అంటే మెగా ఫ్యాన్స్ వారం రోజుల ముందు నుంచే తెగ హడావిడి మొదలు పెడతారు. కానీ ఆయన నటించిన సినిమాల హడావిడి కనిపించడం లేదు. ముఖ్యంగా మరుగున పడిపోయిన విశ్వంభర విషయమే తేలడం లేదు. కనీసం చిరు బర్త్ డే కి అయినా దర్శకుడు వశిష్ట ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా..

గత ఏడాదిన్నరగా విశ్వంభర అప్ డేట్స్ కోసం వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి స్థానంలో ఇరిటేషన్ మొదలైంది. చిరు కూడా జూన్ కానీ జులై కానీ విశ్వంభర విడుదల ఉండొచ్చని చెప్పినా అటు వైపుగా ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మరి మరో పది రోజుల్లో విశ్వంభర నుంచి రాబోయే ఆ ట్రీట్ గురించి మెగా ఫ్యాన్స్ లో మెల్లగా ఆసక్తి స్టార్ట్ అయ్యింది.

కానీ వశిష్ట నుంచి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దానితో మెగా ఫ్యాన్స్ లో మళ్లీ ఆందోళన కనిపిస్తుంది. బాబీ ఎలాగూ చిరు 158 నుంచి అదిరిపోయే ట్రీట్ సిద్ధం చేస్తున్నారు. దానితో పాటుగా విశ్వంభర కూడా ఉంటె బావుంటుంది అనేది మెగా ఫ్యాన్స్ ఆశ.  

Fans Waiting for Viswambara