ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwanath and Sons With Regular Ticket Price

విశ్వనాథ్ & సన్స్ కు టికెట్ ధరల పెంపు లేదు

Vishwanath and Sons With Regular Ticket Price

 

 

డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ స్స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’. అనౌన్స్‌మెంట్ నుంచి అంద‌రిలోనూ ఈ సినిమాపై ఆస‌క్తి పెరుగుతూ ప్రీ రిలీజ్ బజ్‌ రోజురోజుకూ మ‌రింత‌గా పెరుగుతోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. పాటలు కూడా చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. డైరెక్ట‌ర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

సూర్య హీరోగా నటించిన‌ ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ, కుటుంబ బంధాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాల క‌ల‌యిక‌గా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించటానికి సిద్ధ‌మైంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీత సార‌థ్యం వ‌హించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలవడంతో థియేట్రికల్ రిలీజ్‌పై మ‌రింత జోష్ పెరిగింది.

ఇప్ప‌టికే వైవిధ్యంగా చేసిన సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా అంచనాలను మరింత పెంచాయి. కోయంబత్తూరు, కొచ్చిలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్స్‌కు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాలకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, చిత్రబృందం కూడా సినిమాలోని ఎమోషనల్ కోర్ గురించి మాట్లాడి అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది. ఈ రెండు ఈవెంట్స్‌లో కనిపించిన సందడి, పాజిటివ్ వైబ్ సినిమాపై పెరుగుతున్న బజ్‌కు మరింత బలాన్నిచ్చాయి.

తాజాగా ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా మేక‌ర్స్ సినిమా టికెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రేక్షకులు అందుబాటు ధరల్లో మంచి కంటెంట్, క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాను రూపొందించామ‌ని చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు సూర్య అభిమానులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించడంపైనే చిత్రబృందం ఫోక‌స్ పెట్టింది.

కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చే హీరో సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’తో మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, క్యారెక్టర్ డ్రివ‌న్ ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్‌కు తన సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వెంకీ అట్లూరి, ఈసారి కూడా బలమైన మానవ సంబంధాల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇప్పుడు అందరి దృష్టి రేపు జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఉంది. కోయంబత్తూరు, కొచ్చిలో జరిగిన ఈవెంట్స్‌కు భారీ స్పందన రావడంతో తెలుగు ఈవెంట్‌లో సూర్య ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య స్పీచ్‌తో పాటు అభిమానులతో ఆయన చేసే ఇంటరాక్షన్ ఇప్పటికే ఉన్న ప్రీ రిలీజ్ హైప్‌ను మరింత పెంచుతుందని అనుకుంటున్నారు.  ‘విశ్వనాథ్ & సన్స్’ చుట్టూ బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సూర్య అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ సినిమాపై ఆస‌క్తి రోజురోజుకూ పెరుగుతోంది.

శ్రీక‌ర స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘విశ్వనాథ్ & సన్స్’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. సూర్య‌, మ‌మితా బైజు ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన‌ ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు.

No Price Hike for Vishwanath and Sons