ఆ దర్శకుడితో అఖిల్ నెక్స్ట్

Akhil Next with Pavan Sadineni


అక్కినేని అఖిల్ ఫైనల్ గా హిట్ అందుకున్నాడు. లెనిన్ చిత్రంతో రూ.100 కోట్ల హీరో అయ్యాడు. మురళి కిషోర్ అబ్భురి తెరకెక్కించిన లెనిన్ చిత్రంతో అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. లెనిన్ బ్లాక్ బస్టర్ అవడంతో భార్య జైనాబ్ తో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ కు వెళ్లొచ్చిన అఖిల్ తన తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేస్తాడు అనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది.

తాజాగా అఖిల్ తన నెక్స్ట్ మూవీ ని పవన్ సాదినేనితో చెయ్యబోతున్నట్టుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సేనాపతి, దయా వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ లతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ సాధినేని తో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.

ప్రెజెంట్ పవన్ సాధినేని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని తో పవన్ సాధినేని చిత్రం ఉండోచ్చనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది.

Akhil To Team Up with Pavan Sadineni