ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mothers Day 2026 - Katrina and Kiara celebrate the special day for first time ever

వెండితెర తారల మాతృత్వపు మురిపం

 

మదర్స్ డే వేళ భారతీయ చిత్ర పరిశ్రమలో  భావోద్వేగపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది కత్రినా కైఫ్, కియారా అద్వానీ ,పత్రలేఖ వంటి అగ్ర నటీతార‌లు నిజ జీవితంలో అమ్మ అనే మధురమైన హోదాను అనంత‌రం జరుపుకుంటోన్న  తొలి మదర్స్ డే కావడం విశేషం. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  తారలు ఇప్పుడు తమ చిన్నారులతో గడుపుతోన్న అపురూప క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు తమ చిన్నారితో జరుపుకుంటోన్న వేడుకలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

మాతృత్వం అనేది తన జీవిత దృక్పథాన్నే మార్చేసింద‌ని  బిడ్డ సంరక్షణలో గడిపే ప్రతి నిమిషం వెలకట్టలేనిదని  నటీమణులు పేర్కొంటున్నారు. కియారా అద్వానీ తన బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి నేటి వరకు ప్రతి రోజూ ఓ కొత్త పాఠమేనని ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే పత్రలేఖ కూడా అమ్మగా మారడాన్ని  గొప్ప వరంగా అభివర్ణించారు. గ్లామర్ ప్రపంచంలో అత్యంత బిజీగా ఉంటూనే కెరీర్  కుటుంబం మధ్య సమతుల్యం  పాటిస్తూ మాతృత్వాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న న్యూ మామ్స్ నేటి తరం మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ సెలబ్రిటీల మాతృత్వపు వేడుకలు వ్యక్తిగత సంతోషానికే పరిమితం కాకుండా సమాజంలోని తల్లులందరి నిస్వార్థ ప్రేమని , త్యాగాలను గౌరవించే వేదికగా మారాయి. వెండితెరపై వారు చేసే అద్భుతాల కంటే నిజజీవితంలో అమ్మగా వారు పొందుతున్న ఆనందం మిన్న అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిడ్డల రాకతో తమ జీవితాల్లోకి కొత్త కాంతి వచ్చిందని భావిస్తున్న  బాలీవుడ్ సుందరీమణులకు 2026 మదర్స్ డే వారి జీవితాంతం గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

Mothers Day 2026 SpecialsMothers Day 2026 - Katrina and Kiara celebrate the special day for first time ever