ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Chief Minister title card goes viral

టైటిల్స్ లో ముఖ్య‌మంత్రి విజ‌య్

 

ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం  `జననాయగన్`  కావ‌డంతో  సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ వినూత్నమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ పడే సమయంలో విజయ్ పేరుకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి అని వేయాలని కోరుతుండటం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

విజయ్  సినిమా కెరీర్‌కు స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో ప్రజా సేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్న తరుణంలో అభిమానులు ఆయనను  ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. వెండితెరపై ఆయన చివరిగా కనిపించే ఈ చిత్రంలో తమ అభిమాన నటుడిని అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిగా చూడాలనేది వారి ఆకాంక్ష. గతంలో కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో వారి రాజకీయ ఆశయాలకు తగ్గట్లుగా టైటిల్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జననాయగన్ టీమ్ ఈ డిమాండ్‌పై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సినిమా పరంగా చూస్తే ఈ చిత్రంలో విజయ్ ఒక శక్తివంతమైన ప్రజా నాయకుడిగా కనిపించబోతున్నారని సమాచారం. అందుకే సినిమా థీమ్‌కు తగ్గట్లుగా కూడా ముఖ్యమంత్రి అనే ట్యాగ్ ఉపయోగించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా? విజయ్ తన సినీ ప్రస్థానాన్ని ముగిస్తూ రాజకీయ క్షేత్రంలో అడుగుపెడుతున్న వేళ అభిమానుల  డిమాండ్ ఆయన పట్ల ఉన్న వారి అపారమైన నమ్మకాన్ని చాటి చెబుతుంది. 

Fans Demands To Add Cm Before Vijay NameVijay Chief Minister title card goes viral