ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Drishyam star Meena's driverless taxi ride

డ్రైవర్‌లెస్ టాక్సీలో మీనా సాహసం

Drishyam star Meena's driverless taxi ride

 

వెట‌ర‌న్  న‌టి  మీనా తాజాగా  ఓ వినూత్న‌ ప్రయాణం తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ కార్లలో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ మీనా మాత్రం ఏకంగా డ్రైవర్ లేని రోబో టాక్సీలో ప్రయాణించి ఆ అనుభవాన్ని  అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో `నా డ్రైవర్‌ను పరిచయం చేయనా?` అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

డ్రైవర్ సీటు ఖాళీగా ఉన్న దృశ్యాన్ని చూపించారు. టెక్నాలజీపై నమ్మకంతో చేసిన సాహసోపేతమైన ప్రయాణం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఇది అమెరికాలోని ఓ  నగరంలో జరిగి ఉండొచ్చ‌ని  నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు వృత్తిపరంగా మీనా తన సెన్సేషనల్ ప్రాంచైజీ `దృశ్యం 3`తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సరసన మీనా న‌టిస్తోన్న‌  చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ తో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.  వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన చిత్ర‌మిది. కానీ  గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

సెన్సార్ బోర్డు నుండి U/A  సర్టిఫికేట్ అందుకున్న  చిత్రం ఇప్పుడు మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సిరీస్ మూడవ భాగంతో ఎలాంటి ముగింపును ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

Meena’s driverless taxi video goes viral