ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Even Average Talk Can Create Wonders For Peddi

జస్ట్ బావున్నా - కలెక్షన్స్ ఆపలేరు

Even Average Talk Can Create Wonders For Peddi


పాన్ ఇండియా స్టార్ పెద్ది జూన్ 4 విడుదల అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ చాల భయపడ్డారు. వేసవి సెలవలు వెళ్లిపోతున్నాయి, జూన్ అంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయని, అప్పుడు పెద్ది కలెక్షన్స్ తగ్గుతాయని భయపడ్డారు.

కానీ జూన్ 4 అంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడే పూర్తి కావు. అంతేకాదు ప్రస్తుతం థియేటర్స్ లో చూసేందుకు మంచి సినిమాలు లేక ప్రేక్షకులు మొహం వాచిపోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో గనక పెద్ది చిత్రానికి జస్ట్ బావుంది అనే టాక్ పడినా చాలు కలెక్షన్స్ కుమ్మెయ్యడం ఖాయం. అంతేకాదు పెద్దికి మరో అడ్వాంటేజ్.. ఇతర పాన్ ఇండియా భాషల్లో పోటీ ఇచ్చే సినిమా ఏది లేకపోవడం.

పెద్ది నార్త్ నుంచి సౌత్ వరకు ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీసు బరిలోకి దిగుతుంది. అదే పెద్ది కున్న అతి పెద్ద అడ్వాంటేజ్. పెద్ది చిత్రం సూపర్ హిట్ పక్కా.. కారణం ఆ సినిమా కి వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది. అయినప్పటికీ ఏదైనా తేడా వచ్చినా, యావరేజ్ అనిపించుకున్నా పెద్ది దూకుడు ఆపడం కష్టం.

సో మెగా ఫ్యాన్స్ అస్సలు భయపడక్కర్లేదు. పెద్ది ఎప్పుడు దిగినా థియేటర్స్ లో విధ్వంశమే. ఇక పెద్ది ట్రైలర్ వచ్చాక అసలు సిసలు అంచనాలు కనిపిస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు.

Can Peddi Create Miracles