ఏపీ ప్రభుత్వ కళారత్న పురస్కారాలు
AP Government announces Kala Ratna Awardశ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం సందర్భంగా కళారత్న (హంస) మరియు ఉగాది పురస్కారాల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడమైనది .
ముఖ్య కార్య నిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి , విజయవాడవారు సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాలలో వ్యక్తులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని పైన పేర్కొనబడిన కమిటీ వారు 40 మంది కళారత్న (హంస) పురస్కార గ్రహీతలను మరియు 124 మంది ఉగాది పురస్కార గ్రహీతలను ఎంపిక చేసారు అని తెలియపరచినారు మరియు ఎంపిక చేసినవారిని కళారత్న మరియు ఉగాది పురస్కారాలతో గౌరవించడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
ఈ విషయమును నిశితంగా పరిశీలించిన తరువాత, ప్రభుత్వం వారు శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం పురస్కారాలు - 2026 కింద వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ఎంపిక చేసి, వారిని కళారత్న (హంస) మరియు ఉగాది పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించింది
అందులో భాగంగా సినిమా జర్నలిజం కేటగిరిలో సినీజోష్ రాంబాబు(పర్వతనేని రాంబాబు కి) బెస్ట్ సినీ జర్నలిస్ట్ గా అవార్డు ను ప్రకటించారు. ఈ అవార్డుల వేడుక మార్చ్ 19 ఉగాది రోజు ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుంది.
AP Government announces Kala Ratna and Ugadi Awards







































