ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhartha Mahasayulaku Vignyapthi set for its Digital Premiere

ఫైనల్ గా BMW ఓటీటీ డేట్ ప్రకటన

Bhartha Mahasayulaku Vignyapthi set for its Digital Premiere

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. 

సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా ప్రకటించారు. 

Bhartha Mahasayulaku Vignyapthi set for its Digital Premiere on ZEE5 from March 13th

ravi teja