హాట్ కొరియోగ్రఫర్ హీటెక్కించే భామగానా
Shrasti Verma Special Songశ్రష్టి వర్మ పరిచయం అవసరం లేని పేరు. ఒక్క సంఘటనతో అమ్మడు తెలుగింట పాపులర్ అయింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మడు కొరియోగ్రాఫర్ గా ప్రమోట్ అయింది. సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ప్రస్తుతం శ్రష్టి వర్మకంటూ ప్రత్యేకమైన అభిమానులు, ఫాలోవర్స్ ఉ న్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీగానూ నిలుస్తోంది.
ప్రోఫెషనల్ గా ఎంతో బిజీ అయింది. స్టార్ హీరోల చిత్రాలకు పాటలు కంపోజ్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది. ట్యాలెంటెడ్ బ్యూటీ కావడంతో భవిష్యత్ లో అమ్మడు కొరియోగ్రఫార్ గా మరింత బిజీ అవ్వడం ఖాయం. అలాగే అవకాశం వచ్చిన సందర్భంలో వెండి తెరపై నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.
ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆసినిమా రిలీజ్ అయ్యే సమయానికి అమ్మడు అంత ఫేమస్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పాపులారిటీని గుర్తించిన మేకర్స్ `ధర్మస్థల నియోజకవర్గం` సినిమాలో ఐటం పాట బాద్యతలు అగప్పించారు. బాధ్యతలు అంటే? తానే ఐటం భామగా నటించడం.
ఇంత వరకూ ఏ సినిమాలోనూ అమ్మడు ఐటం పాటల్లో నటించలేదు. అలాంటి అవకాశాలు రాలేదు. కానీ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. క్లిక్ అయితే గనుక శ్రష్టి వర్మకు తిరుగుండదు. ఐటం భామగా మరిన్ని అవకాశాలు అందుకుని బిజీ అవుతుంది. ఐటం పాటల కోసం ఇప్పటికీ ముంబై భామలపైనే ఆధారపడాల్సి వస్తోంది. శ్రష్టి వర్మ నిలదొక్కుకుంటే గనుక స్టార్ హీరోల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకోగల్గుతుంది.
Shrasti Verma Special Song On Silver Screen







































