మోషన్ క్యాప్చుర్‌తో టాలీవుడ్ ప్రయోగాలు
Tollywood experiments with Motion captureప్రస్తుతం టాలీవుడ్ లో మోషన్ క్యాప్చుర్ సినిమాల హంగామా చర్చగా మారింది. ఇప్పటివరకూ కేవలం విదేశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంకేతికతను అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక ల్యాబ్ కి తేవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ దీనిని సద్వినియోగం చేస్తున్నారు.
ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న `వారణాసి`లో కీలక సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ ఫాంటసీ- సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం, ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ లోని `కల్కి 2898 ఏడి 2` కోసం, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ కోసం, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కోసం మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
తారల కదలికలను ముఖ కవళికలను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి వాటిని డిజిటల్ క్యారెక్టర్లకు గ్రాఫిక్స్ పాత్రలు అన్వయించే సాంకేతికతను మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీ అంటారు. అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అవెంజర్స్ సహా చాలా హాలీవుడ్ భారీ చిత్రాలను మోషన్ క్యాప్చుర్ సాంకేతికతతో తెరకెక్కించారు.
Five films with Motion capture







































