ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra felt limited in Bollywood

గ్లోబ‌ల్ బ్యూటీ ఇలా షాకిచ్చిందేంటి

Priyanka Chopra felt limited in Bollywood

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా కెరీర్ ఎంత గొప్ప‌గా సాగింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా బాలీవుడ్ నే ఏలిన న‌టిగా పీసీకి పేరుంది. అమ్మ‌డు న‌టించని స్టార్ అంటూ ఎవ్వ‌రూ లేరు. దాదాపు స్టార్  హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. ప్ర‌యోగాల‌కు సైతం వెనుకాడ‌ని న‌టిగా పీసికి పేరుంది. స‌రిగ్గా కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే హాలీవుడ్ లోనూ లాంచ్ అయింది.

 

`క్వాంటికో` సిరీస్ తో అక్క‌డా ఎంతో ఫేమ‌స్ అయింది. దీంతో అమ్మ‌డు హాలీవుడ్ పైనే ఫోక‌స్ చేసి అక్క‌డే సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టింది. స‌క్సెస్ అవ్వ‌డంతో బాలీవుడ్ కి  పూర్తిగా దూర‌మైంది. కొంత కాలంగా హాలీవుడ్ సినిమాలు త‌ప్ప బాలీవుడ్ సినిమాలు చేయ‌లేదు. ఇటీవ‌లే తెలుగు సినిమా `వార‌ణాసి`లో న‌టించ‌డానికి ఒప్పుకుంది.

 

అదీ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ కావ‌డంతోనే పీసీ అంగీక‌రించింన్న‌ది కాద‌న‌లేని నిజం. పాన్ వ‌ర‌ల్డ్ లో కెరీర్ ప‌రంగా `వార‌ణాసి` మ‌రింత గుర్తింపు తీసుకొస్తుంద‌నే న‌మ్మ‌కంతో క‌మిట్ అయింది. అయితే ఈ బ్యూటీ హాలీవుడ్ కి వెళ్ల‌డం వెనుక‌..అక్క‌డే స్థిర‌ప‌డ‌టం వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి? అన్న‌ది ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు.

 

బాలీవుడ్ లో పీసీ కెరీర్ తాను అనుకున్న విధంగా లేక‌పోవ‌డంతోనే హాలీవుడ్ కి వెళ్లిన‌ట్లు  పీసీ మాట‌ల్లో అర్ద మ‌వుతోంది. పీసీ నుంచి ఎంత మాత్రం ఊహించ‌ని స‌మాధానం ఇది. అంద‌రికీ తెలిసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మాత్ర‌మే. కానీ పీసీపై అక్క‌డా పెద్ద రాజ‌కీయం జ‌రిగింద‌ని ఆమె మాట‌ల్లో అర్ద‌మ‌వుతుంది. బాలీవుడ్..హాలీవుడ్ లో ఏ సినిమాకు ప్రాధాన్య‌త ఇస్తారంటే? ఎవ‌రైనా సొంత భాష‌ను ముందుగా చెబుతారు. కానీ పీసీ  రెండు భాష‌లు త‌న‌కు స‌మాన‌మే అని, ఏ ఇండ‌స్ట్రీ తాను త‌క్కువ‌గా భావించ‌డం లేదంది.  

Priyanka Chopra Opens Up About Moving From Bollywood To Hollywood

priyanka chopra