వరుణ్ తేజ్ అతడ్ని లాక్ చేసాడా
Varun tej next with Vivek Athreyaమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో `కొరియన్ కనకరాజ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `ఎఫ్ 3` తర్వాత సరైన హిట్ పడక పోవడంతో? ఆచితూచి మరీ గాంధీ వినిపించిన స్టోరీని ఒకే చేసాడు. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్ ఇంత వరకూ ఇలాంటి జానర్ టచ్ చేయ లేదు.
ప్రయోగాలతో పాటు, కమర్శియల్ చిత్రాల్లో నటించాడు గానీ కామెడీ జోలికెళ్లింది లేదు. కామెడీ ట్రాక్ లో గాంధీకి మంచి పేరుంది. ఇంత వరకూ ఆ జానర్లో అతడు ఫెయిలవ్వలేదు. తీసిన కొన్ని సినిమాలు హిట్..యావరేజ్ గా ఆడాయి. దీంతో వరుణ్ తేజ్ మరో ఆలోచన లేకుండా `కొరియన్ కనకరాజ్` కి కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
మిగతా పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా వరుణ్ మరో కథకు ఒకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. `సరిపోదా శనివారం` ఫేం వివేక్ ఆత్రేయ నేరేట్ చేసిన స్టోరీ నచ్చడంతో ఒకే చేసినట్లు తెలిసింది. ఇది ఓ కమర్శియల్ అంశాలున్న చిత్రమని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
`సరిపోదా శనివారం` కమర్శియల్ గా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ వివేక్ ఆత్రేయకు అప్పటి నుంచి హీరో దొరకలేదు. హీరోలంతా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న వరుణ్ తేజ్ ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
Varun tej Locks His Next Director







































