హీరో రామ్ ప్లాన్స్ చేంజ్

Chang In Plans For Hero Ram

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో హిట్ కొట్టాను అనుకున్న రామ్ పోతినేని కి ఆ చిత్ర కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ రాలేదు. దానితో రామ్ డిజప్పాయింట్ అయ్యి సైలెంట్ అయ్యాడు. ఆ దెబ్బకి ఆయన తదుపరి సినిమాలపై వచ్చిన న్యూస్ లు, ఆయన అనుకున్న సినిమాలు అన్ని పక్కకి పోయాయి.

గత మూడు నెలలుగా రామ్ సైలెంట్ గా ఉంటున్నాడు, తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించడం లేదు. దానితో రామ్ తదుపరి చిత్రాలపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. కానీ రామ్ మాత్రం ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఆచితూచి స్క్రిప్ట్ ని ఎంచుకోవాలని చూస్తున్నాడట.

నేను శైలజ తో తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల వైపు రామ్ కన్ను ఉన్నా.. ఆయన బెస్ట్ స్క్రిప్ట్ ఇస్తే వెంటనే సినిమాని ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. లేదంటే రామ్ వేరే ఆలోచన చేస్తాడని, తన తదుపరి చిత్రాన్ని ఓన్ బ్యానర్ స్రవంతి లోనే చెయ్యాలని రామ్ అనుకుంటున్నట్లుగా టాక్. మరి రామ్ తదుపరి మూవీ ఏ బ్యానర్ లో, డైరెక్టర్ తో ఉండబోతుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.

Hero Ram Extra Precautions For His Next

ram