పెద్ది - అయ్యే పనేనా..
Will Peddi Release as scheduled
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తోన్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 విడుదలవుతుందా.. మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ అయిన పెద్ది ఏప్రిల్ 30 అంటూ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు. మరి ఆ ఏప్రిల్ 30 న అయినా పెద్ది వస్తుందా, అది సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు సమయమే ఉంది.
రెండు నెలలు ఉందిగా ఎందుకు హడావిడి అనుకోవచ్చు. పాన్ ఇండియా మూవీస్ కి ప్రమోషన్స్ ప్రోపర్ గా ఉండాలి, పోస్ట్ ప్రొడక్షన్ లో హరిబరి అవకూడదు, ఇప్పుడు బుచ్చిబాబు పగలనక రాత్రనక షూటింగ్ చేస్తూ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాడు. రాత్రి ఎడిటింగ్, ఉదయాన్నే షూటింగ్ అన్నట్టుగా బుచ్చిబాబు పరుగులు పెడుతున్నారు.
మరోపక్క రెహమాన్ చెన్నైలో రీ రికార్డింగ్ చేస్తున్నారు, అది కూడా బుచ్చి బాబు చూసుకుంటున్నాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక హడావిడి బాగా పెరిగింది, పెద్ద సినిమా పాన్ ఇండియా ప్రమోషన్స్ ఉండాలి, దానికి 15 రోజుల సమయమైనా ఉండాలి, అందుకే బుచ్చిబాబు సతమతమవుతున్నాడు. మరి ఇంతిలా కష్టపడుతున్నారు.
ఒకవేళ అటు ఇటు అయ్యి రిలీజ్ డేట్ మారితే.. సమస్యే లేదు, ఏప్రిల్ 30 కి ఖచ్చితంగా పెద్ది రావాల్సిందే. చూద్దాం పెద్ది విషయంలో మేకర్స్ ఏం చేయబోతున్నారో అనేది.
Can Peddi Arrive on Time







































