వారణాసి స్టోరీ లైన్ రివీల్డ్

Varanasi Storyline Revealed

 

ఎప్పుడు తన సినిమా గురించి మీడియా కి చెప్పేసి అప్పుడు తన పని మొదలు పెట్టె రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న వారణాసి విషయంలో అప్ డేట్స్ అందించడానికి ఆచి తూచి అడుగులు వేశారు. ఓ పెద్ద ఈవెంట్ ద్వారా వారణాసి టైటిల్ ని, గ్లింప్స్ ని విడుదల చెయ్యడం, వారణాసి వీధుల్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడం వంటి విషయాలతో రాజమౌళి సినిమాపై హాలీవుడ్ స్థాయిలో అంచనాలు పెంచారు.

ఇక హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ తాజాగా వారణాసి కథ ఎలా ఉంటుందో ఫైనల్ గా రాజమౌళి బయటపెట్టారు. శివ భక్తుడిగా ఉండే రుద్ర(మహేష్ బాబు) ఆతర్వాత ఓ మిస్టరీని చేధించేందుకు బయలుదేరి రాముడి అవతరమెత్తి త్రేతాయుగంలో చేయాల్సిన ఓ కార్యం పూర్తి చెయ్యడానికి మందాకినీ(ప్రియాంక చోప్రా) సహాయం చెయ్యడం..

ఆ క్రమంలోనే అసలు తాను ఈ మిస్టరీని ఛేదిస్తే ఎవరికి లాభం అనే విషయంలో ఓ క్లారిటీకి రావడం ఇది వారణాసి కథగా రాజమౌళి కాస్త క్లూ ఇచ్చారు. వారణాసి ఐమాక్స్ అనుభవం అంటూ రాజమౌళి కొత్త ఫార్ములాతో రాబోతున్నారు. ఏప్రిల్ 7, 2027 టార్గెట్ గా వస్తోన్న వారణాసి షూటింగ్ జూన్ లేదా జులై కల్లా కంప్లీట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా సమయమంతా గ్రాఫిక్స్ కోసం వెచ్చిస్తుంది టీం.

SS Rajamouli On Varanasi Storyline

varanasi storyline