ప్రేక్షకులు - థియేటర్స్ రెండూ విలవిలా
lack of major film releases Theaters Facing dry phase
సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటివరకు థియేటర్స్ లో క్రేజ్ ఉన్న సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. సంక్రాంతి సినిమాలతో థియేటర్స్ కళకళలాడాయి. ఆతర్వాత రెండు వారాలకే థియేటర్స్ బోసి పోయాయి. ఈ వారం విశ్వక్ సేన్ ఫంకీ ఓ మాదిరిగా ఆనే సినిమా. ఆతర్వాత రెండు వారాలు సరైన సినిమాలు లేవు.
ఇక మార్చ్ మొదటి మూడు వారాలు డ్రైగా కనిపిస్తుంది. చిన్న చిన్న సినిమాలు తప్ప పేరున్న సినిమాలేవీ థియేటర్స్ లోకి రావట్లేదు. మార్చి 19 డబ్బింగ్ చిత్రాలు ధురంధర్ 2, యష్ టాక్సిక్ (స్ట్రయిట్ మూవీ అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ డౌట్) తప్ప థియేటర్స్ లో సరైన సినిమా విడుదల కావట్లేదు.
జనవరి 15 తర్వాత మళ్లీ మార్చ్ 19 వరకు థియేటర్స్ లో క్రేజీ నోటెడ్ మూవీస్ లేవు అంటే ప్రేక్షకులు ఎంతగా బోర్ ఫీల్ అవ్వాలి. థియేటర్స్ ఎంతగా విలవిలలాడాలి. మార్చ్ 19 తర్వాత మళ్ళి 26 న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్ 3 శర్వానంద్ బైకర్, ఏప్రిల్ 30 రామ్ చరణ్ పెద్ది .. ఇలా నెలకో సినిమా లేదంటే రెండు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి తప్ప థియేటర్స్ లో ఆయమన్న సినిమాల్లేవు.
దానితో ప్రేక్షకులు, థియేటర్స్ రెండు విలవిలలాడుతున్నాయి. మళ్లీ ఆగష్టు, దసరా వచ్చేవరకు థియేటర్స్ కి ఈ సంకటస్థితి తప్పేలా కనిపించడంలేదు.
Theatres Facing survival crisis








































