అనగనగ ఒకరాజు ఓటీటీ టాక్
Anaganaga Oka Raju OTT Talkగత ఏడాది ఎప్పుడో థియేటర్స్ లో విడుదలకావల్సిన బొమ్మ అనగనగ ఒకరాజు. నవీన్ పోలిశెట్టి యాక్సిడెంట్ తర్వాత రెండేళ్లకు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి సీజన్ లో అనగనగ ఒకరాజు సినిమా రిలీజ్ అంటూ ఆశ్చర్యపరిచిన నవీన్ పోలిశెట్టి డిఫ్రెంట్ ప్రమోషన్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాడు. సంక్రాంతి సీజన్, కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ గట్టిగా కనెక్ట్ అయ్యారు.
థియేటర్స్ రూ.100 కోట్ల బొమ్మగా నిలిచిన ఈ చిత్రం నిన్న ఫిబ్రవరి 11 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. థియేటర్స్ లో తెగ హడావిడి చేసిన అనగనగ ఒకరాజు చూద్దామని ఓటీటీలోకి వెళితే.. ఓపెనింగ్ షాట్ నుంచే నవీన్ పోలిశెట్టి తనపై తను వేసుకునే జోక్ లు మరీ రొటీన్ గా అనిపించాయంటూ ఓటీటీ ఆడియన్స్ మాట్లాడుతున్నారు.
రొటీన్ స్టోరీ నే, కామెడీ యాడ్ చేసేసి మమ అనిపించేసారు. BGM మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా తగ్గకుండా మెప్పించింది, సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి కానీ.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కూడా కొన్నిసార్లు బోర్ కొట్టించేసింది, రొటీన్ కథతో క్లైమాక్స్ ఎండ్ చేసారు.
సంక్రాంతి సీజన్ కాబట్టి బయటపడిపోయింది, లేదంటే అనగనగ ఒకరాజు థియేటర్స్ లోను యావరేజ్ అయ్యుండేది, థియేటర్స్ లో ఒకరు నవ్వితే మరొకరికి నవ్వు వచ్చి ఉంటుంది, ఓటీటీ లో మాత్రం అనగనగ ఒకరాజు చప్పగా ఉంది అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Anaganaga Oka Raju Average Talk On OTT







































