ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is Kajal Agarwal Out Of Tollywood race

టాలీవుడ్ కి రిటైర్మెంట్ ఇచ్చేసిన‌ట్లేనా

Is Kajal Agarwal Out Of Tollywood raceIs Kajal Agarwal Out Of Tollywood race

టాలీవుడ్ లో కాజ‌ల్ అగ్వార్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌శాబ్దంన్న‌ర పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని నాయిక‌గా కొన‌సాగింది. దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. సీనియ‌ర్ హీరోల నుంచి త‌ర్వాత త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌ర్నీ క‌వ‌ర్ చేసిన న‌టి. `మ‌గ‌ధీర` విజ‌యం త‌ర్వ‌త అమ్మ‌డు కెరీర్ వెనక్కి తిరిగి చూడ‌కుండా సాగిపోయింది.

 

మిత్ర వింద పాత్ర‌తో న‌వంత‌రం భామ‌ల‌కు స్పూర్తిగా నిలిచింది. హీరోయిన్ గా న‌టిస్తే అలాంటి రోల్ ఒక‌టి చేయాల‌ని అంద‌రిలోనూ ఓ ఆశ క‌ల్పించింది. అలా కాజ‌ల్ అగ‌ర్వాల్ పాన్ ఇండియాలో ఎంతో ఫేమ‌స్ అయింది. అటుపై త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ బాగానే సినిమాలు చేసింది. కానీ తెలుగులో స‌క్సెస్ అయినంత‌గా ఆ రెండు భాష‌ల్లో కొన‌సాగ‌లేదు.

 

ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు ప్రేమ‌లో ప‌డ‌టం..పెళ్లి చేసుకోవ‌డం..ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అవ్వ‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి.  అలాగ‌ని వ‌చ్చిన అవ‌కాశాల‌కు నో చెప్ప‌లేదు. వాటిని స‌ద్వినియోగం చేసుకుంటూనే ఐటం భామ‌గా ఛాన్సులొచ్చినా ప‌ని చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంగా కాజ‌ల్ సినిమాలు పూర్తిగా త‌గ్గించింది. కేవ‌లం రెండు..మూడు సినిమాలు మాత్ర‌మే చేసింది.

 

హీరోయిన్ గా `భ‌గ‌వంత్ కేస‌రి`లో న‌టించ‌గా, `క‌న్న‌ప్ప‌`లో కామియో పాత్ర పోషించింది. ఈ రెండు మిన‌హా కాజ‌ల్ లైన‌ప్ లో సినిమాలే క‌నిపించ‌లేదు. దీంతో చంద‌మామ కెరీర్ టాలీవుడ్ లో దాదాపు ముగిసిన‌ట్లుగానే క‌నిపిస్తోంది.

ఫేడౌడ్ అయిన నేప‌థ్యంలో కొత్త అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మాత్రం `రామాయ‌ణం`తో పాటు `ది ఇండియ‌న్ స్టోరీ`లో న‌టిస్తోంది.

Kajal Graciously Planning Her Retirement From Films

kajal