సెట్స్ మీదకి వెళుతున్న విజయ్ - మృణాళ్

Team VD13 and SVC54 is ready to rollTeam VD13 and SVC54 is ready to roll

విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈ మధ్యే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.

 

VD13: Wrapped up location reccee in the USA and gearing up for shoot

vd13