ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhola Shankar is the Megastar who finished dubbing

మార్క్ మై వర్డ్స్: మెగాస్టార్

Bhola Shankar is the Megastar who finished dubbingBhola Shankar is the Megastar who finished dubbing

మెగాస్టార్ చిరంజీవి,  మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కిన భోళా  శంకర్ టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ అలరించారు మెగాస్టార్. ఇటివలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్ లో కలుద్దాం! # భోళాశంకర్ ఆగస్టు 11 అని ట్వీట్ చేశారు మెగాస్టార్.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Bhola Shankar dubbing finished

bhola shankar