Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Royal Event Of Shyam Singha Roy In Warangal

శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Royal Event Of Shyam Singha Roy In Warangal

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో  సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొననున్నారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.

 

Royal Event Of Nani Shyam Singha Roy In Warangal On December 14th

royal event
nani
shyam singha roy
hero nani
warangal
december 14th