Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Star heroes pressuring themselves for looks

PR పంచ్: ఒళ్లు గుల్ల చేసుకుంటున్న టాప్ హీరోలు!

Star heroes pressuring themselves for looks

 

తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ల‌పై చాలా ఒత్తిడి ప‌ని చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈరోజుల్లో స్టార్ గా కొన‌సాగాలంటే కేవ‌లం అందం- ఆక‌ర్ష‌ణ స‌రిపోదు. తీరైన దేహ‌శిరులు కావాలి. కండ‌లు మెలితిరిగి ఫిట్ గా క‌నిపించాలి. లేదా క‌థానాయిక‌లు జీరో సైజ్ లుక్ లో ప‌ర్ఫెక్ట్ బికినీ బాడీ కోసం స‌రిప‌డే రూపంతో మెర‌వాలి.

ముఖ్యంగా మ‌న స్టార్ హీరోలు త‌మ లుక్ కోసం లేదా మేకోవ‌ర్ కోసం ఒళ్లు గుల్ల చేసుకుంటూ చేస్తున్న సాహ‌సాలు అన్నీ ఇన్నీ కావు. అపుడెపుడో బాహుబ‌లి కోసం ప్ర‌భాస్, రానా చాలా సాహ‌సాలు చేసారు.  ఫిజిక‌ల్ గా మేకోవ‌ర్ కోసం ఆ ఇద్ద‌రూ క‌ఠోర‌మైన త‌ప‌స్సు చేసారు. తినే ఆహారం తాగే ద్ర‌వాలు మొద‌లుకుని ఫిట్ బాడీ పంపింగ్ కోసం చాలా చేసార‌నే టాక్ ఉంది.  ప్ర‌భాస్, రానా భారీకాయులు అయ్యారు. అయితే  ఆ మేకోవ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ద‌గ్గుబాటి రానా రూపం అనూహ్యంగా ఎలా మారిపోయిందో చూసాం. అత‌డు కొన్ని అనారోగ్య కార‌ణాల‌తో అమెరికాలో చికిత్స చేయించుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఫిజిక‌ల్ గా చాలా హార్డ్ వ‌ర్క్ చేయ‌డం, క‌ఠిన‌మైన వ్యాయామాల‌కు తోడు రానాకు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు దీనికి కార‌ణ‌మ‌య్యాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అలాగే బాహుబ‌లి చిత్రంలో దేవ‌సేన‌గా న‌టించిన అనుష్క శెట్టి ఆ త‌ర్వాత `సైజ్ జీరో` కోసం నిజంగానే ఒళ్లు గుల్ల చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న పాత్ర కోసం బాగా లావెక్కి.. ఆ త‌ర్వాత తిరిగి త‌గ్గేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా బొద్దుత‌నం త‌గ్గ‌లేదు. దీనికి తోడు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు తెలెత్తాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఈ అగ్ర క‌థానాయిక సినిమాల‌కు దూర‌మైంది. చాలా సెల‌క్టివ్ గా నెమ్మ‌దిగా త‌న కెరీర్ ని సాగించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.  

ఇక స్టార్ హీరోల విష‌యానికి వ‌స్తే... ప్ర‌భాస్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఫిజిక‌ల్ మేకోవ‌ర్ కోసం ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. బాడీ అప్పియ‌రెన్స్ లో మేకోవ‌ర్ కోసం మ‌న స్టార్ హీరోలంతా చాలా అధిక శారీర‌క శ్ర‌మ‌ను అనుస‌రిస్తున్నారు. జిమ్ లో హెవీ వెయిట్స్ ఎత్తుతూ షేపులు మార్చుకుంటున్నారు. దీనికోసం ప‌ర్స‌న‌ల్ కోచ్ ల‌కు కోట్ల‌కు కోట్లు చెల్లిస్తూ, క‌ఠిన‌మైన నియ‌మాల‌ను పాటిస్తూ చాలా టైర్ అవుతున్నారు.

ఇటీవ‌ల వార‌ణాసి కోసం మ‌హేష్ 50 ప్ల‌స్ వ‌య‌సులో ఎంత తీవ్రంగా శ్ర‌మించారో చూసాక షాక్ తిన‌కుండా ఉండ‌లేక‌పోయాం. ఆ త‌ర్వాత అనూహ్యంగా ప్ర‌శాంత్ నీల్ `డ్రాగ‌న్` కోసం ఎన్టీఆర్ లో చాలా మార్పులు చూసాం. అత‌డు అత్యంత క‌ఠిన‌మైన నియ‌మాల‌తో త‌న బ‌రువును అమాంతం త‌గ్గించాడు. అత‌డి మారిపోయిన రూపం చూసి ఇది మ‌న యంగ్ టైగ‌రేనా? అని ఆశ్చ‌ర్య‌పోయారు. త‌న సినిమా కోసం అత‌డు ఇన్ని రిస్కులు చేసినా కానీ మారిన రూపం నిజంగా షాక్ వేవ్స్ పంపింది. అభిమానులు త‌మ క‌ళ్ల‌ను న‌మ్మ‌లేక‌పోయారు. ఇక పెద్ది కోసం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఒళ్లు గుల్ల చేసుకున్న తీరు చూసాం. చ‌ర‌ణ్ స్వ‌త‌హాగానే హార్డ్ వ‌ర్కర్. తన‌కు ఏదైనా ఛాలెంజింగ్ ఆఫ‌ర్ వ‌స్తే అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌డు. పెద్ది కోసం అత‌డి మేకోవ‌ర్ చూసి షాక్ తిన‌ని వారు లేరు. కానీ దీనికోసం అహోరాత్రులు అత‌డు శ్ర‌మించిన తీరు ఒళ్లు గుల్ల చేసుకున్న వైనం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే ఇంత ఘోరంగా శ్ర‌మిస్తే మ‌న స్టార్ల ఆరోగ్యాలు మెరుగ‌వుతున్నాయా?  పర్మినెంట్ లుక్ వ‌చ్చేసిన‌ట్టేనా?  పిట్నెస్ స్థాయి పెరిగిందా? అంటే కొన్ని విష‌యాల్లో బెట‌ర్ మెంట్ ఉంటుంది కానీ ఒక్కోసారి కొన్ని సైడ్ ఎఫెక్టులు తేడా కొట్టాయి. కొంద‌రి ముఖంలో గ్లో పోతోంది. ద‌వ‌డ‌లు చ‌ప్ప‌బ‌డిపోతున్నాయి. ఇంత‌కుముందు ద‌గ్గుబాటి రానా, అనుష్క శెట్టి ఈ ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఇటీవల ఎన్టీఆర్ రూపం ఈ తీరుగా మారిపోవ‌డం షాకిచ్చింది. మ‌హేష్ చాలా బ‌క్క ప‌లుచ‌గా మారిపోయారు.

అంతిమంగా విశ్లేషిస్తే .. నాటి మేటి క్లాసిక్ డే స్టార్స్ ఎవ‌రూ ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. ఫిజిక‌ల్ రూపం కోసం ఇంత‌టి త్యాగాలు, అన‌వ‌స‌ర‌ రిస్కులు చేయ‌నే లేదు. విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ, అన్న‌గారు ఎన్టీఆర్, న‌ట‌ సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అంద‌గాడు శోభ‌న్ బాబు, సూప‌ర్ స్టార్ కృష్ణ ఫిజిక‌ల్ ఫిట్ నెస్ కోసం మ‌రీ ఈ రేంజులో ఒళ్లు గుల్ల చేసుకోలేదు. ఆరోజుల్లో స్టార్లు ఎవ‌రూ ఫిజిక‌ల్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ కోసం ఇంత‌గా శ్ర‌మించ‌లేదు. సాధార‌ణ‌మైన జిమ్, యోగా, మెడిటేష‌న్ ని అనుస‌రించారు కానీ, క‌ఠిన వ్యాయామాల జోలికి వెళ్ల‌లేదు. అయితే రూపంలో మార్పుల‌తో సంబంధం లేకుండా ఆరోజుల్లో వారంతా న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్లు కొట్టాయి. ఇప్పుడు మ‌న పెద్ద హీరోలు ఎంత‌గా శ్ర‌మించినా ఫిజిక‌ల్ రూపంతో సంబంధం లేకుండా ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అలాగే న‌టీన‌టుల రూపం కంటే క‌థ‌, కంటెంట్ ఇప్పుడు చాలా కీల‌కంగా మారాయన్న‌ది యూనివ‌ర్శ‌ల్ ఎలిమెంట్.
 

Heroes spending lakhs and lakhs in gyms and for trainers