బాధను మరిచి బాధ్యతను గుర్తించి.!
Chandrababu Naidu and Pawan Kalyan Discuss Key Decisions
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో తెగ తెంపులు చేసుకున్నారు. 15 రోజుల క్రితమే భార్య భర్తలుగా విడిపోయినప్పటికీ గత అర్ధరాత్రి ఆ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కారణం స్థానిక సంస్థల ఎన్నికలపై తన వ్యక్తిగత జీవిత ప్రభావం పడకూడదు అని. ఎంత రాజకీయ నాయకుడు అయినా, సెలెబ్రిటీ అయినా భార్య తో విడిపోవడం వెనుక ఎంతో బాధ ఉంటుంది.
కానీ పవన్ కళ్యాణ్ ఆ బాధను మరిచి బాధ్యతను గుర్తించి నేడు జరిగిన క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు తో కరచాలనం చేస్తూ పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ లో పాల్గొన్నారు. హిట్ కొట్టామంటూ చంద్రబాబు, పవన్ లు పరస్పరం కరచాలనం చేసుకుంటూ కేబినెట్ భేటీకి వెళ్లారు .
కేబినెట్ హాల్‌లోకి వెళ్లగానే చంద్రబాబు-పవన్ కల్యాణ్ కు మంత్రులు అభినందనలు తెలిపారు. అది చూసి పవన్ కళ్యాణ్ ఎంత బాధలో ఉన్నా బాధ్యతనెరిగి ప్రజా సంక్షేమం కోసం విధులకు హాజరయ్యారు అంటూ జనసైనికులు మాట్లాడుకుంటున్నారు
















































