ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The bond between Pawan and Anna Lezhneva is special!

ప‌వ‌న్- అన్నా లెజ్నెవా బాండింగ్ ప్ర‌త్యేకం!

The bond between Pawan and Anna Lezhneva is special!The bond between Pawan and Anna Lezhneva is special!

నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్- ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడాకుల‌తో వేరైన‌ట్లు కొద్ది సేప‌టి క్రిత‌మే క్లారిటీ వ‌చ్చింది. విష‌యాన్ని ఇద్ద‌రు అధికారికంగా ధృవీక‌రించారు. 13 ఏళ్ల బంధానికి పుల్ స్టాప్ పెడుతూ తీసుకున్న నిర్ణ‌యం అభిమానుల్ని ఎంతగానో బాధిస్తుంది. ఒక్క‌సారి వీరి విష‌యాల్లోకి వెళ్తే.. ఈ జంట ప్రయాణం 2011లో  రిలీజ్ అయిన `తీన్ మార్` సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభమైంది.

ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా.. అన్నా లెజ్నెవా  చిన్న పాత్రలో కనిపించారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో కొద్దికాలం డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం  వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇది మూడో వివాహం కాగా.. వీరిద్దరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. అలాగే అన్నా మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమార్తె పోలెనా అంజన పవనోవను కూడా పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు.

పెళ్లి తర్వాత అన్నా లెజ్నెవా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత చదువులపై దృష్టి పెట్టారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి 2024లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్  డిగ్రీ  పూర్తి చేశారు. అంతే కాకుండా రష్యా, సింగపూర్‌లలో హోటల్ రంగంలోనూ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. వివాహం తర్వాత చాలా సందర్భాలలో లైమ్ లైట్‌కు దూరంగా ఉన్నా? ఆమె పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో వెన్నంటి నిలిచారు. కానీ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఇరువురు వేర‌వ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.
 

Pawan and Anna Lezhneva