ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> YS Jagan returned without casting his vote

ఓటెయ్యని జగన్ - మళ్లీ బెంగుళూరు కి జంప్

YS Jagan returned without casting his voteYS Jagan returned without casting his vote

 

ఓటెయ్యడానికి బెంగుళూరు ప్యాలెస్ నుంచి పులివెందులకు వెళ్లిన జగన్.. తన సొంత నియోజక వర్గంలో ఓటు వెయ్యకుండానే మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులు పర్మిషన్ ఇచ్చిన సమయం కన్నా ముందే జగన్ హెలికాఫ్టర్ పులివెందులకు చేరుకోవడంతో.. అధికారులు జగన్ హెలికాఫ్టర్ ని ల్యాండ్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయిన జగన్ మోహన్ రెడ్డి భారీ ర్యాలీతో రోడ్ చేస్తూ ఓటు వేసేందుకు వచ్చారు. అయితే క్యాడర్ ని రెచ్చగొడుతూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు సజావుగా జరగడం లేదు అంటూ రోడ్డుపై బైఠాయించారు. పులివెందులలో ఎన్నికలు సక్రంగా జరుగుతున్నాయని, పులివెందులలో పోలింగ్ ప్రక్రియపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.  

పులివెందులలో 47 మంది ఏజెంట్లు మాకు రిపోర్టు చేశారు.. అని కలెక్టర్ చెప్పినా వినకుండా జగన్ ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు. తాను ఓటు వేస్తే అంతా సక్రమంగా జరిగింది అని ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో అని జగన్ ఓటు వెయ్యకుండా నానా హడావిడి చేసి బెంగుళూర్ కి వెళ్లిపోయారు. మరి పులివెందులలో ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే అక్కడే ఉండొచ్చు, కానీ బెంగుళూరుకి చెక్కెయ్యడమే వైసీపీ నేతలను, కార్యకర్తలకు ఆశ్చర్యం కలిగించింది.

జగన్ ఓటు వెయ్యకుండా వెళ్లిపోవడంపై మంత్రి అచ్చన్నాయుడు స్పందించారు.. పులివెందుల పులినని గొప్పలు చెప్పుకునే జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటు వేయకుండా వెనుదిరగడం ఆయన రాజకీయ పిరికితనానికి నిదర్శనమని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. 

YS Jagan back to Bangalore without Casting Their Vote