ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> AP: Global Horticulture Hub being established

రాయలసీమలో ప్రపంచ ఉద్యాన కేంద్రం

AP: Global Horticulture Hub being establishedAP: Global Horticulture Hub being established


రాయలసీమ రతనాల సీమ అన్నట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చే బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ పటంలో రాయలసీమ ను ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమం మొదలయ్యింది.

రాయలసీమ రైజింగ్ ప్రాజెక్ట్ లో పూర్వోదయ పథకం కింద ప్రభుత్వ వాటాగా రూ.40,352 కోట్లు ఖర్చు చేయనుండగా, ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60,000 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబు గత 6 నెలలుగా వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, జలవనరుల శాఖలతో సమీక్షలు నిర్వహించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అనుమతులు సాధించారు.

ఈ హార్టికల్చర్ హబ్ పనులు అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్‌ కడప లాంటి సీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 303 మండలాల పరిధిలోని 5,869 గ్రామాల్లో జరగనున్నాయి. దీనితో పాటుగా  రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు రైతులు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో తరచూ ఏర్పడే కరువు పరిస్థితులు, మార్కెట్ అనుసంధాన సమస్యలకు పరిష్కారంగా తక్కువనీటితో పంటలు పండిస్తూ, అధిక లాభాలు గడించేలా ఈ సమగ్ర ప్రణాళికను తెచ్చినట్లు పేర్కొన్నారు. 

All set for launch of Rs 1 lakh-cr horticulture hub today