BB10: .ఈ వారం డేంజర్ లో ఎవరంటే

Bigg Boss 10: This week voting resultBigg Boss 10: This week voting result


బిగ్ బాస్ సీజన్ 10 లో నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్, నామినేషన్స్ రెండూ హౌస్ ని హీటెక్కించాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బోటం లైన్ లో ఉన్నారు అనే విషయంలో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందులో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలోనూ ఆసక్తి కనిపిస్తుంది.

నాలుగో వారంలో ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి నామినేషన్స్ లోకి రాగా.. ముందు నుంచి త్రిగుణ్ ఓటింగ్ లో డామినేట్ చేస్తున్నాడు. అతని మాట తీరు ఎలా ఉన్నా ఆట తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఓటింగ్ లో త్రిగుణ్ ని టాప్ లో నిలబెడుతున్నారు.

నామినేషన్స్ లో ఉన్న మిగతా వారితో పోలిస్తే సగం ఓట్లు త్రిగుణ్ పట్టుకుపోయాడు. మిగతా ఓట్స్ ని మిగతా వారు పంచుకుంటున్నారు. సెకండ్ ప్లేస్ లో రోహిత్ ఉంటె.. మూడో స్థానంలో ముఖేష్ గౌడ్ ఉన్నాడు. నాలుగో స్థానంలో షాలిని ఉంటె.. 5th ప్లేస్ లో చరణ్ కొనసాగుతున్నాడు. ఆరో స్థానంలో సృష్టి ఉంది.

చివరి మూడు స్థానాల్లో అమన్, దేబ్జానీ, నరేష్ లు ఉన్నారు. అంటే డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు ఉన్నట్టే. మరి ఈరోజు శుక్రవారం ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరి స్థానాలు ఎటు మారుతాయో అనేది చూడాలి. 

Bigg Boss 10