ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> M Chandrababu Inaugurates the Veligonda Project

వెలిగొండ ప్రాజెక్టు ను ప్రారంభించిన CBN

M Chandrababu Inaugurates the Veligonda ProjectM Chandrababu Inaugurates the Veligonda Project


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు... అంతేకాకుండా కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీటి భరోసా కల్పించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది.

పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ శిలాఫలకాన్ని ప్రారంభించి వెలిగొండకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయంటూ, సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కొత్త అధ్యాయమని వ్యవయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కలను సాకారం చేశారని, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే జాతికి అంకితం చేయడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు.

CM Chandrababu Inaugurates Veligonda Phase 1