NBK 111 టైటిల్ టైమ్ ఫిక్స్

Title Reveal Time Fixed for NBK 111Title Reveal Time Fixed for NBK 111


నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం బాలయ్య కాలి గాయం కారణముగా షూటింగ్ కి బ్రేక్ పడింది. బాలయ్య గాయం నుంచి కోలుకుంటూ ఉండడంతో గోపీచంద్ మలినేని కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి NBK111 కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసారు.

తాజా NBK 111 మేకర్స్ ఈ చిత్రానికి టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు డేట్ లాక్ చేసారు. టైటిల్ మరియు రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 6 న విడుదల చెయ్యబోతున్నట్టుగా చిన్న వీడియో తో అనౌన్స్ చేసారు. NBK 111 కి గాడ్ లేదంటే దాదా అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఇక డిసెంబర్ 24 న NBK 111 ప్రాజెక్ట్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 6 న NBK 111 టైటిల్ అండ్ రిలీజ్ డేట్స్ అన్ని రివీల్ అవుతాయన్నమాట. 

 

Title And Release Date Reveal Time Fixed for NBK 111