ముద్రగడ పద్మనాభం కన్నుమూత..!

Mudragada Padmanabham passes awayMudragada Padmanabham passes away

 

ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూసారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ ఈరోజు మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో ఐసీయూ లో ఉన్న ఆయన నేడు కన్నుమూయడం ఆయన అభిమానులను కలిచివేసింది.

కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడకు కాపు ఉద్యమ నేతగా మంచి గుర్తింపు ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముద్రగడ.. రెండుసార్లు మంత్రిగా, కాకినాడ ఎంపీగా పని చేశారు. దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.  

కాపుల కోసం అనేకసార్లు ఆందోళనలు, నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. ఈ పోరాటం కారణంగా ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమైంది. ముద్రగడ మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు, కాపు సంఘాలు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.
 

Mudragada Padmanabham