Advertisementt

అన్నీ నిజాలు కాదు సారూ..

Wed 29th Nov 2023 07:41 PM
atchannaidu  అన్నీ నిజాలు కాదు సారూ..
Atchannaidu అన్నీ నిజాలు కాదు సారూ..
Advertisement
Ads by CJ

చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టానుసారం రాతలు రాస్తే నమ్మే రోజులు కావివి. 

కక్ష కట్టుకుని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్న పచ్చరోతలు, పిచ్చిరాతలు చూస్తే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రణాళిక ప్రకారం వైసీపి ప్రభుత్వం బురదజల్లే కార్యక్రమాన్ని ఓ వర్గం మీడియా బుజానికెత్తుకుంది. కేంద్రం నుండి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ అధికారులు అత్యధికులు సిఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని టిడిపి నేత అచ్చన్నాయుడు చేత చెప్పించడం, దాన్ని తాటికాయంత అక్షరాలతో వేయడం, ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం అనుకూల మీడియా చేస్తోంది. రాష్ట్రంలో చేసిన అభివృద్ది పచ్చమీడియాకు కనిపించదు. 

జరుగుతున్న డెవలప్ మెంట్ వైపు వారు కన్నెత్తి చూడరు. టిడిపి హయాంలో జరిగిన ఆన్యాయాల గురించి ఆ మీడియా మాట్లాడదు. గురువిందగింజ సామెతలా వ్యవహరిస్తుంది. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి ఆ మీడియాకి ఎందుకు గుర్తుకు రాదు. కేంద్రం నుండి బాబు హయాంలో ఐఏఎస్  అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఎపి క్యాడర్ కు వచ్చారు.

వీరితో పాటు బాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఎంతోమంది అధికారులను బాబుకు అనుకూలంగా ఉన్న వారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. లేనిది ఉన్నట్లు గా చూపించే పచ్చదండు గురువు నేతృత్వంలో టన్నుల కొద్ది విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. 

ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేని యల్లోమీడియా టిడిపి ఓటమి భయంతో అడ్డకోలు రాతలు, పచ్చి అబద్దాలు రంగరించి వండి వార్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది యల్లో మీడియా దండు. జర్నలిజం ఎథిక్స్ కు తిలోధకాలొదిలి తప్పుడు కథనాలు అచ్చేసే ఆ వర్గం మీడియా విశ్వసనీయత ఎప్పుడో గంగపాలైపోయింది.

Atchannaidu:

Media

Tags:   ATCHANNAIDU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ