సీక్వెల్ కోసం విశాల్ తో సమంత?
VIshal and Samantha
సమంత రీసెంట్ గానే పండంటి బాబు కి జన్మనిచ్చింది. కొడుకు పేరు దేవ్ నిడిమోరు గా నామకరణం చేసేసారు. అయితే సమంత కు నార్మల్ డెలివరీ అయ్యిందా, లేదంటే సి సెక్షన్ జరిగిందా అనే విషయమై రాజ్ నిడిమోరు పిన్ని మాట్లాడుతూ.. సమంత కు పెయిన్ స్టార్ట్ అయ్యి సి సెక్షన్ చెయ్యాలి అన్నపుడు తాము హనుమాన్ చాలీసా పఠనం మొదలు పెట్టామని.. కొద్దిక్షణాల్లోనే సమంత కు నార్మల్ డెలివరీ అయ్యి క్షేమంగా ఉంది అని ఆమె తెలిపారు.
ఇక సమంత ప్రస్తుతం కొడుకు తో టైమ్ స్పెండ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటుంది. అయితే సమంత రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమవుతుంది. అది కూడా కోలీవుడ్ హీరో విశాల్ తో కలిసి అభిమన్యుడు సీక్వెల్ చేసేందుకు సన్నద్ధం అవుతుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యుడు చిత్రం లో సమంత డాక్టర్ గా కనిపించింది. ఆ చిత్రం విశాల్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ ప్రిపేర్ చేస్తున్నారని.. ఈ చిత్రంతోనే సమంత రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి.. సమంత డెసిషన్ ఎలా ఉంటుందో అనేది.
















































