కొలిక్కి వస్తున్న ఫౌజీ

Fauzi Nearing CompletionFauzi Nearing Completion


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ చిత్రం ఈపాటికి విడుదలకు రెడీ అవడమేకాదు.. పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోషన్స్ తో హడావిడి చెయ్యాల్సింది ఎందుకంటే డిసెంబర్ 3 ఫౌజీ అని డేట్ ఇచ్చారు కనుక. కానీ ఇప్పుడా తేదికి ఫౌజీ విడుదల కావడం లేదు.

కారణం షూటింగ్ పూర్తి కాకపోవడం పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకోకవడంతో ఫౌజీ విడుదల వాయిదా పడి వచ్చే ఏడాది మార్చి 19 కి వెళ్ళిపోయింది. ఇక ప్రభాస్ కూల్ గా ఫౌజీ షూటింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో స్పిరిట్ వైపు వెళుతున్నారు. అలాగే కల్కి 2 షూటింగ్ సెట్ లోను ప్రభాస్ కనిపిస్తున్నారు.

తాజాగా ప్రభాస్ ఫౌజీ కి సంబందించిన తన పోర్షన్ లో దాదాపు మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటిని పూర్తి చేసుకున్నారు అని తెలుస్తుంది. వీటితో పాటుగా మిగతా టాకీ పార్ట్ కూడా త్వరలోనే పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఫౌజీ చిత్ర షూటింగ్ ని తర్వాత ముగించేసి ప్రభాస్ తన మొత్తం ఫోకస్ ఇకపై సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ పై పెట్టనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

Fauzi shooting update