సంక్రాంతి రేసులో విశ్వంభర.. కాకా పై కొత్త లెక్కలు!
Vishwambhara Gets Clear Route to Sankranti!మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్తలు టాలీ వుడ్లో వినిపిస్తున్నాయి. 2024 సంక్రాంతికి ప్రకటించిన ఈ సినిమాను.. జనవరి 13, 2027న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అదే రోజున చిరంజీవి మరో సినిమా `కాకా` రిలీజ్‌కు షెడ్యూల్ అవ్వడంతో అసలు ఏ సినిమా డేట్ మారుతుందా? అనే చర్చ మొదలైంది.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న `విశ్వంభర`లో చిరంజీవి విశ్వ పాత్రలో కనిపించనుండగా.. త్రిష అవనిగా నటిస్తున్నారు. కృపాల, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, సురభి పురాణిక్, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సత్య లోకంతో పాటు 14 లోకాల నేపథ్యంలో సాగే కథ ఇది.. తొలుత 2025 సంక్రాంతికి రావాల్సినా వీఎఫ్ఎక్స్ పనులు, టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో అవుట్‌పుట్‌ను మెరుగు పరుచుకోవడం కోసం వాయిదా వేస్తున్నారు.
మరోవైపు బాబీ కొల్లి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న `కాకా` కూడా జనవరి 13, 2027కే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశ్వంభర లైన్ లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఒకే రోజు చిరంజీవి నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది చరిత్రలో ఇంత వరకూ జరగలేదు. ఈసారి కూడా అందుకు అవకాశం ఉండదు. డేట్లు మార్చే అవకాశం ఉంటుంది.















































