ఆర్యన్ ఖాన్ తో బంధం-బ్రెజిలియన్ బ్యూటీ క్లారిటీ
Brazilian beauty clarifies her relationship with Aryan Khan
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ - బ్రెజిలియన్ మోడల్, నటి లారిస్సా బోనేసీ మధ్య ఉన్న స్నేహంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలు, ఈవెంట్లలో ఇద్దరు తరచుగా కనిపిస్తుండటంతో బంధంపై చర్చ జరుగుతున్న వేళ తాజాగా లారిస్సా స్పందించింది. 16 ఏళ్ల క్రితం కెరీర్ కోసం ముంబైకి వచ్చిన తనకిప్పుడు ఈ నగరమే సొంత ఇల్లుగా మారిందన్నారు. ఖాన్ కుటుంబం తనకు ఎంతో ఆత్మీయత ఏర్పడిందన్నారు. ఇటీవల ఓ ఇంటీరియర్ డిజైన్ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్న లారిసా వారి విజయాలను.. వారి వ్యక్తిత్వాన్ని ఎంతగానో గౌరవిస్తానని.. జీవితంలో స్నేహం.. వారి మద్దతు ఎంతో విలువైనవని వెల్లడించారు.
షారుఖ్ ఖాన్ ని కింగ్ గా ఎప్పటికీ నిలిచిపోయే లెజెండ్‌గా అభివర్ణించారు. షారుక్ సాధించిన విజయాల కంటే వాటిని చేరుకున్న విధానం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్తో` దర్శకుడిగా పరిచయమైన ఆర్యన్ ఖాన్ పనితీరును ప్రశంసించారు. అన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా? తాను నమ్మిన విషయాల కోసం భవిష్యత్తు కోసం ఆర్యన్ నిరంతరం శ్రమిస్తాడని..అతను ఎంతో తెలివైనవాడని కొనియాడారు. భవిష్యత్తులో ఆర్యన్ దర్శకత్వంలో నటించాలనే ఆసక్తిని బయటపెట్టారు.
లారిస్సా సినీ ప్రయాణం..వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. విదేశీ నేపథ్యం నుంచి వచ్చి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం అంత సులభం కాదన్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా? పరిస్థితులకు తగ్గట్టుగా మలచుకుంటూ ముందుకు సాగితే ఇక్కడి వారి ఆదరణ లభిస్తుందన్నారు. హిందీని క్లాసులకు వెళ్లకుండా.. రోజూ కలిసే ఆటోవాలాలతో మాట్లాడుతూ హిందీ నేర్చుకున్నాన్నారు. అందుకే తన హిందీలో ఆ యాస వినిపిస్తుందని సరదాగా నవ్వారు. ప్రస్తుతం ఆరు భాషలు మాట్లాడగలనని.. హిందీతో పాటు తెలుగులోనూ డైలాగులు చెప్పగలనన్నారు.















































