సెన్సార్ చిక్కులపై సంపత్ నంది క్లారిటీ!
Bhogi director on censor board's concernsశర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కతోన్న `భోగి` నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది.
తాజాగా సినిమాలో హింసాత్మక సన్నివేశాలపై సంపత్ నంది స్పందించారు. ఆ సన్నివేశాలు కావాలని ఇరికించిన హింస కాదని.. కథ డిమాండ్ మేరకు సహజంగా వచ్చేవేనని స్పష్టం చేశారు. సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీకి పంపడం ఊహించని పరిణామమని.. దాని వల్ల ప్రమోషన్లకు టైమ్ తగ్గినా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.
ఈ కథ పుట్టుక వెనుక చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోని రామగిరి గుట్ట వద్ద మూఢనమ్మకాల పూజలు చేసే వ్యక్తిని చూసి చిన్నప్పుడు భయపడి పారిపోయేవారట. ఆ తర్వాత ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఇలాంటి ఘటన పేపర్‌లో చదివాక దీన్ని కథగా మలిచారు.. అయితే ఇది కల్పిత కథేనని బొగ్గులగుట్ట అనే ఊరి నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. శర్వానంద్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 13నే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆరకంగా ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకుండా రివైజింగ్ కమిటీకి పంపడంతో రిలీజ్ వాయిదా వేసి ప్రమోషన్లు కూడా ఆపేశారు. అవన్నీ పూర్తి చేసుకుని మరికొన్ని గంటల్లో రిలీజ్ కు రెడీ అవుతుంది.















































