హీరోయిన్ డైలాగ్ డెలివరీపై నెటిజనుల కామెంట్స్!
Netizens' comments on the heroine's dialogue delivery!శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈఠా సినిమా డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతోంది. తొలుత ఈ సినిమాను టాక్సిక్‌తో పోటీగా రిలీజ్ చేయాలనుకున్నా? ఆ తర్వాత మేకర్స్ డిసెంబర్‌కు వాయిదా వేశారు. ప్రమోషనల్ కంటెంట్ చూసి శ్రద్ధా డైలాగ్ డెలివరీపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్యారెక్టర్‌కు ఉండాల్సిన బరువు, గంభీరత డైలాగుల్లో కనిపించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. సినిమా పూర్తిగా చూశాకే ఒక అంచనాకు రావాలనే మాట కూడా వినిపిస్తోంది. విమర్శించిన వాళ్ల నోళ్లను శ్రద్ధా తన నటనతో మూయిస్తుందా? లేక నిజంగానే ఆ పాత్రలో తేలిపోతుందా అనేది రిలీజ్ తర్వాతే తేలుతుంది.
ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మ శర్మ కలిసి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
















































