సీత పాత్రకు సాయి పల్లవి సెట్ అవ్వలేదు!
Tanishaa said she felt the actress was completely miscast as Sita
రామాయణం సినిమా చూసిన నటి తనీషా ముఖర్జీ అభిప్రాయాన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. ముందుగా `యానిమల్` లో రణబీర్ కపూర్ యాక్టింగ్ చూశాక రాముడి పాత్రలో కనెక్ట్ అవుతానా లేదా అనే సందేహం ఉండేదట.. కానీ సినిమా చూశాక మాత్రం ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారని.. మీడియాలో వచ్చే మాటలు చాలా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తనీషా రాసుకొచ్చారు. అలానే రావణుడిగా యశ్ కూడా అంచనాలకు మించి చేశారని.. రాముడికి తగ్గ ప్రత్యర్థిలా నిలిచారంటూ మెచ్చుకున్నారు.
అయితే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి ఎంపిక విషయంలో మాత్రం తనీషా భిన్నంగా స్పందించారు. సాయి పల్లవి గొప్ప నటే అయినా సీతమ్మ పాత్రకు మాత్రం సరిపోలేదని.. తెరపై ఆ విజువల్స్‌తో తనను పూర్తిగా డిస్కనెక్ట్ చేశారని తేల్చి చెప్పారు. కాకపోతే సినిమాలోని విజువల్స్.. కథ, మిగతా నటీనటుల నటన మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెబుతూ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని పోస్ట్ ముగించారు. తనీషా చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా జోరు కొనసాగుతోంది. 20వ రోజు మంగళవారం ఒక్కరోజే ఇండియాలో 17.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 1,735 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది.
















































