వర్రీ అవుతున్న అల్లు ఫ్యాన్స్
Allu fans are worried
అల్లు ఫ్యాన్స్ ఆందోళన పడిపోతున్నారు. ఏరి కోరి అల్లు అర్జున్ - అట్లీ కలయికలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రాకా చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ ని ఎంచుకుని పొరబాటు చేశారనే ఆలోచనలో అల్లు అభిమానులు సతమతమవుతున్నారు. నిన్నటివరకు సాయి అభ్యంకర్ అంటే క్రేజ్.
కానీ ఈరోజు అంటే ధనుష్ ఓ.ఎం విడుదలయ్యాక సాయి అభ్యంకర్ BGM చూసి అల్లు అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఓ.ఎం చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అలాగే BGM పై చాలా విమర్శలొచ్చాయి. ఓ.ఎం చిత్ర నెగెటివ్స్ లో సాయి అభ్యంకర్ BGM కూడా ఉంది. చాలా చోట్ల చెవులు చిల్లులు పడేలా సాయి అభ్యంకర్ BGM ఉంది అంటూ ఆడియన్స్ విమర్శిస్తున్నారు.
అలాంటి విమర్శలు చూసాక నిన్నటివరకు ఉన్న కాన్ఫిడెన్స్ ని అల్లు ఫ్యాన్స్ కోల్పోతున్నారు. నేషనల్ కాదు రాకా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. అటువంటి క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్, అట్లీ లు సాయి అభ్యంకర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుని తొందర పడ్డారేమో అని అభిమానులు వర్రీ అవుతున్నారు.
















































