సినిమా చూసాక మనసు నిండిపోయింది
Adivi Sesh has praised Aakasamlo Oka Tara`ఆకాశంలో ఒక తార` చిత్రంపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చూశాక మనసు నిండిపోడయిందని.. తనకు ఇదొక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని శేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రను ప్రశంసిస్తూ భార్య కలల పట్ల గర్వపడుతూ ఆమెకు అండగా నిలిచే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుందని..ఆ పాత్రను గ్రేటెస్ట్ గ్రీన్ ఫ్లాగ్ గా అభివర్ణించారు.
నటీనటుల పనితీరుపైనా అడివి శేష్ ప్రత్యేకంగా స్పందించారు. సాత్విక వీరవల్లి నటన అద్భుతంగా ఉందని, ఇదొక చిరకాలం గుర్తుండిపోయే డెబ్యూ అని మెచ్చుకున్నారు. స్పేస్ నిపుణురాలి పాత్రలో శ్రుతి హాసన్ చక్కగా ఒదిగి పోయారని.. మురళీ శర్మ.. చైతన్య జెతో పాటు మిగిలిన తారాగణమంతా సమతూకంతో రాణించారని తెలిపారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, రుహానీ శర్మ నటనను కూడా శేష్ ప్రశంసించారు.
ఇలాంటి విభిన్నమైన కథను నమ్మి ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు సందీప్ గున్నం, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలతో పాటు అరవింద్ గారు, గంగరాజు గారి కృషిని శేష్ అభినందించారు. వ్యోమగామి కావాలనే యువతి కలను నెరవేర్చడానికి భార్యాభర్తలు పడే ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథ, పవన్ సాధినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
















































