ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika Mandanna will play MS Subbulakshmi in upcoming biopic

అమ్మ పాత్ర కోసం ర‌ష్మిక సాహ‌సం.. తెలిస్తే షాక్!

Rashmika Mandanna will play MS Subbulakshmi in upcoming biopicRashmika Mandanna will play MS Subbulakshmi in upcoming biopic

భారతరత్న పురస్కార గ్రహీత, సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న `ఎంఎస్ - ఎ లెగసీ ఆన్ స్క్రీన్`బయోపిక్‌లో నటించడం తనకు దక్కిన గొప్ప బాధ్యత అని నటి రష్మిక మందన్న అన్నారు. `రణబాలి` తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్న ర‌ష్మిక‌ పాత్రకు న్యాయం చేసేందుకు కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక పాడటం అనేది తనకు పూర్తిగా కొత్త రంగమని పైకి నటించినట్లు కాకుండా నిజంగా సంగీతాన్ని అభ్యసించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో కనీసం పాటలు కూడా గునుగుతూ ఉండని తాను ఇప్పుడు ఎం.ఎస్. అమ్మ పాత్ర కోసం పాడే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉందన్నారు.

ఈ పాత్ర కోసం తనను సంప్రదించినప్పుడు మొదట కొంత తటపటాయించానని రష్మిక వెల్లడించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి జీవితం, సంగీత ప్రస్థానం భావి తరాలకు ఎంతో ముఖ్యమైనవని, అలాంటి శక్తిమంతమైన పాత్రను తాను పోషించగలనా? అనే సందేహం కలిగిందన్నారు. అయితే తనలోని తపన, కొత్త సవాళ్లను స్వీకరించాలనే ఆసక్తి ఈ సినిమా వైపు నడిపించాయని పేర్కొన్నారు. ఫలితం ఎలా వచ్చినా తన శక్తిమేరకు పూర్తి నిబద్ధతతో కష్టపడతానని  తెలిపారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీత వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోంది. అక్టోబర్‌లోనే ఈ బయోపిక్‌తో అనుబంధాన్ని పంచుకుంటూ సుబ్బులక్ష్మి ఫోటో ముందు ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాలను రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  కృతజ్ఞత చాటుకున్నారు. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మహనీయురాలి పాత్రలో రష్మిక ఎలా మెప్పిస్తారో చూడాలని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rashmika Mandanna intends to start learning Carnatic music to play MS Subbulakshmi
O.M Review
O.M Review
23 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
23 Nov 2026
DNK Review
DNK Review
23 Nov 2026
GOAT Review
GOAT Review
23 Nov 2026
Scene Review
Scene Review
23 Nov 2026
Ramayana Review
Ramayana Review
23 Nov 2026