అనిరుధ్-కావ్య వెడ్డింగ్ రిసెప్షన్ లో ధనుష్ మిస్సింగ్
Dhanush's absence at Anirudh-Kavya Maran wedding reception
హీరో ధనుష్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మధ్య ఏం జరుగుతుంది. నిజంగానే ధనుష్ కి అనిరుద్ కి మధ్యన విభేదాలొచ్చాయా, అందుకే ధనుష్ అనిరుధ్ -కావ్య ల వివాహానికి అలాగే నిన్న చెన్నై లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్ళలేదు, మరోపక్క తన 15 ఇయర్స్ కెరీర్ లో ధనుష్ పేరు ప్రస్తావించలేదు అనిరుధ్.
వారి మద్యన ఏమి జరగకపోతే.. నిన్న చెన్నై లో జరిగిన అనిరుద్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ధనుష్ ఖచ్చితంగా వచ్చేవాడే, అసలు అనిరుద్.. ధనుష్ కి ఇన్విటేషన్ ఇచ్చాడో, లేదో ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో జరుగుతున్న చర్చ. శనివారం పొలిటికల్ లీడర్స్ మద్యన అనిరుధ్ -కావ్యల రిసెప్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు కళానిధి మారన్.
నిన్న ఆదివారం టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల నడుమ అనిరుధ్ -కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగగా.. ఈ వేడుకలో ధనుష్ మిస్ అవడమే ఆయన అభిమానులకు అసంతృప్తిని మిగిల్చింది. అయితే రజినీకాంత్ కి మాజి అల్లుడిగా మారిన తర్వాత ధనుష్ ని అనిరుధ్ కూడా దూరం పెట్టాడనే టాక్ వినబడుతుంది. అందులో నిజమెంతుందో అనేది మాత్రం ఎవ్వరికి క్లారిటీ లేదు.
















































