శ్రీలీల కి కోలీవుడ్ కూడా కలిసి రావట్లేదు!
Sreeleela bad luck continued in Kollywood
క్యూట్ బ్యూటీ శ్రీలీల కి టాలీవుడ్ లో కలిసి రావడం లేదు. గత రెండేళ్లుగా శ్రీలీల కి టాలీవుడ్ లో ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఆమె నటించిన సినిమాలు వరసగా డిజప్పాయింట్ చేసాయి. ధమాకా తర్వాత శ్రీలీలకు తెలుగులో అసలు హిట్ అనేది పడలేదు. మరోపక్క ఆమెకు సక్సెస్ తో సంబంధం లేకుండా తమిళనాట ఛాన్స్ లు వచ్చి పడ్డాయి.
తమిళంలో శ్రీలీల ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ అలాగే అజిత్ కుమార్ తో డేర్ డెవిల్ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ఓ.ఎం చిత్రం గత శుక్రవారమే విడుదలైంది. హీరో ధనుష్ తో కలిసి సాయి పల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీలీలకు ఆ చిత్ర రిజల్ట్ నిరాశను మిగిల్చింది.
ఓ.ఎం చిత్రం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో ఆమె ధనుష్ వైఫ్ గా కనిపించింది. కానీ సాయి పల్లవి కి ఉన్న స్క్రీన్ స్పేస్ శ్రీలీల కు దక్కలేదు. ఆ విధంగానూ శ్రీలీల కి ఓ.ఎం అన్యాయం చేసింది అనే చెప్పాలి. మరోపక్క ధర్మన్ లోను శ్రీలీల మరో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి నటిస్తుంది.
రాశి ఖన్నా, నయనతార లాంటి స్టార్స్ మధ్యలో ధర్మన్ లో శ్రీలీల రోల్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఆమె ఫ్యాన్స్ లో ఉంది. ఇక అజిత్ కుమార్ డేర్ డెవిల్ మాత్రమే ఆమెను ఆదుకోవాలి.
















































