ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vikrant Massey helps Shah Rukh Khan fix his trousers at an award function

హీరో బూటుకు ఇరుక్కున్న ప్యాంట్..వంగి సరిచేసిన మ‌రో స్టార్!

 Vikrant Massey helps Shah Rukh Khan fix his trousers at an award functionVikrant Massey helps Shah Rukh Khan fix his trousers at an award function

 

ముంబైలో  జరిగిన ఓ అవార్డు వేడుకలో షారుక్ ఖాన్- విక్రాంత్ మాసీ మధ్య చోటుచేసుకున్న చిన్న సంఘటన అందరి మనసులను గెలుచుకుంది.. బోమన్ ఇరానీ  ఇద్ద‌రినీ  స్టేజ్ మీదకు ఆహ్వానించినప్పుడు మాట్లాడటానికి సిద్ధమవుతున్న సమయంలో షారుక్ ఎడమ కాలి బూటు చుట్టూ ప్యాంట్ అంచు ఇరుక్కుపోవడాన్ని విక్రాంత్ గమనించారు. వెంటనే కిందకు వంగి ఆ బట్టను జాగ్రత్తగా సరిచేసి సూపర్‌స్టార్‌కు ఇబ్బంది కలగకుండా చూశారు. ఈ చిన్న సాయం పట్ల షారుక్ ఎంతో ఆప్యాయంగా స్పందిస్తూ విక్రాంత్‌ను ఒక చేత్తో హత్తుకుని వీపుపై తట్టడం అక్కడి వేదికపై ఆత్మీయతను నింపింది.

సహచర నటుడిగా విక్రాంత్ చూపించిన  శ్రద్ధ, దానికి బదులుగా షారుక్ ఇచ్చిన ప్రేమపూర్వక స్పందన సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ మీద ఇద్దరూ కలిసి కనిపించిన ఆ క్షణాలు అభిమానులకు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచాయి. పెద్ద స్టార్‌గా ఉన్నా? చిన్న విషయంలోనూ తోటి నటుడితో షారుక్ మెలిగే తీరు మరోసారి చర్చకు వచ్చింది.

మరోవైపు షారుక్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రం `కింగ్` ప్రమోషన్ల సందడి కూడా మొదలవుతోంది.. డిసెంబర్ 14న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలున్నాయి.

Vikrant noticed that the fabric of Shah Rukh's trousers had become caught around his left shoe
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026