ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్
Aadarsha Kutumbam OTT date locked
పలుమార్లు విడుదల తేదీలు మార్చుకుంటూ చివరికి అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఆదర్శ కుటుంబం చిత్రం అనుకున్న అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికి.. త్రివిక్రమ్ డైలాగ్స్ లో పదును తగ్గింది అనే మాట గట్టిగానే వినిపించింది.
ఇక ఈ చిత్రం విడుదలై మూడు వారాలు కావోస్తుంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ డేట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. ఆదర్శ కుటుంబం చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అయ్యింది.
ఈనెల 27 అంటే నవంబర్ 27 నుంచి ఆదర్శ కుటుంబం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ తో కలిసి నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేందుకు రెడీ అయిపోండి.
















































