BB10: డిక్టేటర్ గా ముఖేష్ ఫెయిల్-త్రిగుణ నోటి దూల

Bigg Boss 10: Nagarjuna Fires TrigunBigg Boss 10: Nagarjuna Fires Trigun


బిగ్ బాస్ సీజన్ 10 లో మళ్లీ శనివారం వచ్చేసింది. నాగ్ సర్ వచ్చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా కామెంట్స్ చూసి మరీ హౌస్ మేట్స్ ని పనిష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వారం హౌస్ లో డిక్టేటర్ టాస్క్ జరిగింది. అందులో ముఖేష్, త్రిగుణ లు డిక్టేటర్స్ గా కనిపించారు. త్రిగుణ డిక్టేటర్ గా 100 శాతం ఇచ్చేసాడు. కానీ ముఖేష్ మబ్బేష్ అన్నట్టుగానే వ్యవహరించాడు.

వీకెండ్ లో నాగార్జున వచ్చారు, ఆయన కూడా డిక్టేటర్ గా కనిపించారు. డిక్టేటర్ గా ముఖేష్ కి 100 కి ఎన్ని మార్కులు ఇస్తారు అంటూ ముఖేష్ టీం ని అడగగా రాంప్రసాద్ 30 అన్నాడు, సుధీర్ 30 అన్నాడు, వర్షిణి 90 అంది. బయట ముఖేష్ ఫ్యాన్స్ ని అడిగితె అవి చాలా ఎక్కువ 30 సరిపోతుంది అన్నారు. ముఖేష్ ఫేస్ మాడిపోయింది. నాగార్జున ఇది రియాలిటీ అన్నారు.

ఇక త్రిగుణ గ్రూప్ ని లేపి ఆయనకెన్ని మార్కులు ఇస్తారు అంటే.. శివ్ సర్ నేను 90 ఇస్తాను, ఆ 10 కూడా ఆయన మాటలు జారడం వల్లే తగ్గించా అన్నాడు, మిగతా వాళ్ళు అదే అన్నారు, నాగార్జున కూడా నువ్ డిక్టేటర్ గా ఎంత బాగా చేసినా నీ నోటి దూల వల్ల ఇక్కడికి పడిపోతున్నావ్, నిన్ను ఫ్యామిలీ వీక్ లో ఎక్కడో పెట్టినవాళ్ళే కిందకి పడేస్తారు నోరు అదుపులో పెట్టుకోకపోతే అంటూ ఆయన త్రిగుణ కి క్లాస్ ఇచ్చిన ప్రోమో వదిలారు.

Bigg Boss Telugu 10
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026