ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun's Birthday Wish for Daughter Allu Arha

కూతురు అర్హ కు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

Allu Arjun's Birthday Wish for Daughter Allu Arha Allu Arjun's Birthday Wish for Daughter Allu Arha

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా అప్డేట్లతో పాటుగా తన ఫ్యామిలీతో గడిపే ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్హ, అల్లు అయాన్, అల్లు స్నేహా రెడ్డికి సంబంధించిన విషయాల్ని అల్లు అర్జున్ షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అల్లు వారి పరివారం అంతా కూడా శ్రీలంకలో సందడి చేస్తోంది. అల్లు అర్హ పదో పుట్టిన రోజు సందర్భంగా అల్లు సపరివారమంతా శ్రీలంకలో బర్త్ డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అల్లు అర్హ 10వ పుట్టినరోజు సందర్భంగా ఒక హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేశారు. నా ఈ జీవితపు సంతోషం, ఆనందం (Joy of My Life) అని పేర్కొంటూ అర్హపై తనకున్న ప్రేమను చాటుకున్నారు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గొప్ప అనుబంధాన్ని ప్రతిబింబించే ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్ డే టు జాయ్ ఆఫ్ మై లైఫ్’ అని పోస్ట్ వేశారు.

అల్లు అర్జున్ అటు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంలో కూడా తన కుటుంబానికి అంతే సమయాన్ని ఇస్తుంటారు. కుటుంబంతో గడిపే మధుర క్షణాలను తరచుగా అభిమానులతో ఆయన పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఈ బర్త్ డే పోస్ట్ అర్హతో ఉన్న ప్రత్యేక అనుబంధానికి మరో చక్కని నిదర్శనం.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'శాకుంతలం' చిత్రంతో అర్హ బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. కేవలం ఐదేళ్ల వయసులోనే 'ప్రపంచంలోనే అతి చిన్న చెస్ శిక్షకురాలుగా అల్లు అర్హ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. అర్హలో తెలుగులో మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, అనర్గళంగా చెప్పే పద్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయన్న సంగతి తెలిసిందే.

Allu Arjun's Heartwarming Birthday Wish for Daughter Allu Arha Offers a Glimpse of His Family-Man Side
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026