ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akshay Kumar says health is the foundation of happiness

స్టార్ హీరోని న‌డిపిస్తోన్న నాలుగు సూత్రాలు!

Akshay Kumar says health is the foundation of happinessAkshay Kumar says health is the foundation of happiness

 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ .. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో  తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన 18వ అంతర్జాతీయ కుడో టోర్నమెంట్‌లో ముఖ్య అతితిగా పాల్గొన్న అక్ష‌య్ తన జీవితాన్ని నడిపించే నాలుగు ముఖ్యమైన సూత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుఖ్ (సంతోషం), శాంతి (ప్రశాంతత), సేవా (సేవ) , సెహత్ (ఆరోగ్యం).. ఈ నాలుగింటిలోనూ ఆరోగ్యమే అన్నింటికీ పునాది అని  స్పష్టం చేశారు.

మనిషి జీవితంలో శారీరక ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మిగతా అన్ని ఆనందాలు సాధ్యమవుతాయని వివరించారు. `నా దృష్టిలో అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం. ప్రపంచంలో ఎవరెన్ని చెప్పినా మనం  ఆరోగ్యకరమైన మనిషిలా జీవించాలి. సుఖ్, శాంతి, సేవ అనేవి ఆరోగ్యంతోనే ముడిపడి ఉంటాయి. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉంటేనే సంతోషాన్ని, ప్రశాంతతను , సేవను పొందే అవకాశం లభిస్తుంది` అని  పేర్కొన్నారు. చిన్నతనంలో తన కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నా? ఆరోగ్యమే అసలైన సంపద అనే ఆలోచనే తనను ముందుకు నడిపించిందని  గుర్తుచేసుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న యువ అథ్లెట్లు, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుల ప్రతిభను అక్షయ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీతో పాటు నటి భూమి పెడ్నేకర్ కూడా పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రదర్శనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని యువత ఆరోగ్యం -ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ పెట్టాలని  పిలుపునిచ్చారు. సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న `గోమాల్` సిరీస్ చిత్రంతో పాటు విద్యాబాలన్, రాశి ఖన్నాలతో కలిసి `మౌజా హి మౌజా` చిత్రంలో న‌టిస్తున్నారు.

Akshay Kumar's Fitness Secret at 50
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026