ట్రోల్ అవుతున్న బిగ్ బాస్ రోహిత్
Bigg Boss's Rohit being trolled
బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష తో ఎంటర్ అయిన కామన్ మ్యాన్ రోహిత్ నాయుడు హౌస్ లో మొదటి రెండు వారాలు బాగా పెర్ఫర్మ్ చేసాడు. మూడో వారం నుంచే త్రిగుణ తో కయ్యానికి కాలు దువ్వి, షాలిని తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా ఆయన ఫ్యాన్స్ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. బిగ్ బాస్ హోస్ట్ ని ప్రశ్నించడం, బిగ్ బాస్ నన్నేమి పీకలేడు అంటూ స్టేట్మెంట్స్ పాస్ చెయ్యడం అన్ని చేసినా రోహిత్ అభిమానులు ఆయనకు వెర్రిగా ఓట్లేశారు.
మరి చూసి చూసి బిగ్ బాస్ కె చిరాకు వచ్చి ఉంటుంది.. అందుకే హౌస్ మేట్స్ ఓట్స్ తో రోహిత్ ని బయటకు పంపేశారు. వచ్చాక సైలెంట్ గా ఉన్న రోహిత్ ఫ్యామిలీ వీక్ లో అందరూ త్రిగుణ ని నెత్తిన పెట్టుకోవడంతో భరించలేక ప్రెస్ మీట్ పెట్టి త్రిగుణ పై హౌస్ లో ఏడ్చింది చాలక బయట కూడా ఏడుపు స్టార్ట్ చేసాడు.
త్రిగుణ తన సినిమా పబ్లిసిటీ కోసమే హౌస్ లోకి వచ్చాడు, నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా పర్లేదు అన్నాడు మాతో, అది బయటకు కనిపించి ఉండదు. నేను హోస్ట్ సర్ ని ప్రశ్నించా కానీ అది చూపించలేదు, నన్ను తిట్టినా పర్లేదు త్రిగుణ ఫ్యాన్స్ మా అమ్మను తిట్టకండి, శాలినిని, స్రిష్టి ని, చరణ్ ను టార్గెట్ చెయ్యొద్దు అంటూ సింపతీ మాటలు మాట్లాడాడు
అంతేకాదు నా అభిమానులకు చెబుతున్నా ఆడవాళ్లను కించపరచొద్దు, నాగ్ సర్ ని తిట్టొద్దు, కింగ్ 100 కింద ఎలాంటి నీచమైన కామెంట్లు పెట్టకండి అంటూ అభిమానులను రెచ్చగొట్టిన రోహిత్ ని మీకు రీ ఎంట్రీ ఛాన్స్ వచ్చింది కదా ఎందుకు రిజెక్ట్ చేసారు అంటే.. ఒక్క వారానికి చుట్టం చూపుగా రమ్మన్నారు, నా ఫ్యాన్స్ స్ట్రెంత్ కి అది సరిపోదు అంటూ బిల్డప్ చేసి చెప్పడం చూసి అయ్యా రోహిత్ నీకు అంతలేదు..
బిగ్ బాస్ తో ఫేమస్ అవుదామని వచ్చి బిగ్ బాస్ నే విమర్శిస్తున్నావ్ నువ్వెక్కడి మనిషివి, నీకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ వాళ్ళను అనాలి అంటూ రోహిత్ ని ట్రోల్ చేస్తున్నారు.
















































